కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తించే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. జనసమ్మర్ధం అధికంగా కలిగిన గదిలాంటి ప్రాంతాలు, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు ఉండి.. సుదీర్ఘకాలం పాటు గాలి, వెలుతురు సరిగా లేని గదులలో వైరస్ గాలి ద్వారా విస్తరించే అవకాశమున్నట్లు పేర్కొంది.
ఇటీవల 200 మందికిపైగా శాస్త్రవేత్తలు.. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందంటూ డబ్ల్యూహెచ్ఓకు లేఖ రాశారు. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను, సంరక్షణ చర్యలను సవరించాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.