కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో కరోనా కొత్త రకం వైరస్ ఉద్ధృతికి మానవుల ప్రవర్తనే కారణమని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ అధ్యక్షుడు మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.
"వైరస్ను నిందించడం చాలా సులభం. కానీ, దురదృష్టవశాత్తు మనమే చేయకూడనిది చేసేస్తున్నాం. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను పాటిస్తేనే వైరస్ను అదుపులో పెట్టగలుగుతాం."
--- మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అధ్యక్షుడు