తెలంగాణ

telangana

ETV Bharat / international

'అలా చేస్తేనే కరోనాపై విజయం సాధ్యం!'

ఈ ఏడాది సెప్టెంబర్​ కల్లా ప్రతి దేశం కనీసం 10 శాతం జనాభాకు టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ టెడ్రోస్ అథనోమ్ పిలుపునిచ్చారు. మహమ్మారిని అంతం చేసి.. ప్రపంచ ఆర్ధిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి అదొక్కటే మార్గమని ఇండియా గ్లోబల్ ఫోరమ్​లో పేర్కొన్నారు.

WHO chief on vaccination
టెడ్రోస్ అథనోమ్

By

Published : Jul 1, 2021, 5:08 PM IST

2021 సెప్టెంబర్​ కల్లా ప్రతి దేశం కనీసం 10 శాతం జనాభాకు టీకా పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​ టెడ్రోస్ అథనోమ్. మహమ్మారిని అంతం చేసి.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి అదొక్కటే మార్గమని ఇండియా గ్లోబల్ ఫోరమ్​లో స్పష్టం చేశారు.

వాక్సినేషన్​ ప్రక్రియలో అసమానతలే మహమ్మారి వ్యాప్తికి కారణం. కొన్ని దేశాలు అధిక శాతం జనాభాకు టీకా అందించగలిగాయి. కానీ చాలా దేశాల్లో కనీసం అరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు కూడా టీకా పంపిణీ జరగలేదు. కొన్ని దేశాలు వ్యాక్సిన్​ అందించలేకపోతున్నాయంటే.. అది అన్ని దేశాలకు ప్రమాదకరమే.

- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

అలా అయితే అంతం చేయనట్లే..

మహమ్మారిని అన్ని చోట్ల అంతం చేయకపోతే.. దానిని మనం ఎక్కడా అంతం చేయనట్లే లెక్క అని టెడ్రోస్ అథనోమ్ హెచ్చరించారు. సెప్టెంబర్​ కల్లా ప్రతి దేశం కనీసం 10 శాతం మందికి, ఈ ఏడాది చివరినాటికి 40 శాతం మందికి, వచ్చే ఏడాది సగానికి 70 శాతం జనాభాకు టీకా అందించాలని పిలుపునిచ్చారు. వాక్సిన్​ సమానత్వంతోనే కరోనాను అంతం చేసి, ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించగలమని అన్నారు.

డబ్ల్యూహెచ్​ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీలో అసమానతలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఒక శాతం కన్నా తక్కువ జనాభాకు వ్యాక్సిన్​ అందించగా మరికొన్ని 60 శాతానికి పైగా పంపిణీ చేశాయి. ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకోగా.. ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ చేయడానికి ఉద్దేశించిన కొవాక్స్​ కార్యక్రమం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. దీని ద్వారా పేద దేశాలకు దాదాపు 8.1 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:'సెప్టెంబర్​ నుంచి బూస్టర్​ డోసు పంపిణీ'

'రానున్న రోజుల్లో ప్రమాదకారిగా డెల్టా వైరస్'

ABOUT THE AUTHOR

...view details