తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనాను ఎక్కడ సృష్టించారో చైనా చెప్పాల్సిందే'

చైనా సిద్ధాంతాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారకర్తగా మారిందని అమెరికా ఆరోపించింది. కరోనా సంక్షోభంలో తన విశ్వసనీయతను కోల్పోయిందని వ్యాఖ్యానించారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్​. కరోనా వైరస్​ను ఎక్కడ తయారు చేశారో ఆధారాలతో చెప్పాలని చైనాను డిమాండ్ చేశారు.

VIRUS-US-WHO
కరోనాను ఎక్కడ సృష్టించారో చైనా చెప్పాల్సిందే

By

Published : Apr 22, 2020, 2:13 PM IST

Updated : Apr 22, 2020, 3:18 PM IST

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)తో పాటు చైనాపై అమెరికా అధ్యక్షుడు నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చైనాకు మద్దతుగా వ్యవహరిస్తోందన్న కారణంగా డబ్ల్యూహెచ్​ఓకు నిధులు కూడా ఆపేశారు ట్రంప్.

ఈ నేపథ్యంలో తమ చర్యను సమర్థించుకుంది అమెరికా ప్రభుత్వం. చైనా ప్రచారానికి డబ్ల్యూహెచ్​ఓ వేదికగా మారిందని అమెరికా జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్​ విమర్శించారు.

"ఈ సంక్షోభ సమయంలో డబ్ల్యూహెచ్​ఓ విశ్వసనీయత కోల్పోయింది. ఈ అంతర్జాతీయ సంస్థతో వచ్చిన సమస్య అదే. అంటే డబ్ల్యూహెచ్​ఓ ఎన్నో ఏళ్లుగా నమ్మకమైన సంస్థగా ఉందని కాదు.

డబ్ల్యూహెచ్​ఓ కోసం అమెరికా ఏటా 50 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. చైనా వాటా 4 కోట్ల డాలర్లే. అంటే మాలో పదో వంతు కన్నా తక్కువ. అయినా చైనా సిద్ధాంతాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారకర్తగా పనిచేస్తోంది."

-రాబర్ట్ ఒబ్రెయిన్​, అమెరికా ఎన్​ఎస్​ఏ

రాబర్ట్ చెప్పిన​ కారణాలివే..

చైనా చెప్పినట్లు నడుచుకుని డబ్ల్యూహెచ్​ఓ కరోనాపై ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు రాబర్ట్. వైరస్​ ఒకరి నుంచి మరొకరికి సోకదని జనవరి 14న డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించిందని గుర్తు చేశారు.

రెండోసారి..

ఫిబ్రవరిలో కరోనా ప్రభావిత చైనాతో పాటు కొన్ని ప్రంతాలను నుంచి ప్రయాణాలపై అమెరికాతో సహా పలు దేశాలు నిషేధం విధించాయి. ఈ చర్యనూ డబ్ల్యూహెచ్​ఓ విమర్శించిందని ఆక్షేపించారు రాబర్ట్.

చివరగా..

మార్చి 11న వైద్యేతర సలహాలను డబ్ల్యూహెచ్​ఓ ఇచ్చిందని రాబర్ట్​ ఎద్దేవా చేశారు. చైనాలోని వామపక్ష పార్టీ చర్యలతో కరోనా మహమ్మారిపై అద్భుత విజయం సాధించినట్లు డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించిందని గుర్తుచేశారు.

ఫలితంగా ఇప్పుడు కనీసం 184 దేశాలు వైరస్​తో ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఈ కారణాలతోనే డబ్ల్యూహెచ్​ఓపై నమ్మకం కోల్పోయామని స్పష్టం చేశారు రాబర్ట్. అయితే డబ్ల్యూహెచ్​ఓకు నిలిపేసిన నిధులతో మిత్రదేశాలకు సాయం అందిస్తామని తెలిపారు.

చైనా చెప్పాల్సిందే..

కరోనా వైరస్​ను ఎక్కడ అభివృద్ధి చేశారో ప్రపంచానికి చెప్పాలని చైనాను ఒబ్రెయిన్​ డిమాండ్ చేశారు. మహమ్మారిని కట్టడి చేయటంలో పారదర్శకంగా వ్యవహరించలేదని.. ఫలితంగా చైనాపై ప్రపంచ దేశాల ఒత్తడి పెరుగుతోందని అన్నారు.

"వైరస్​ను ఎక్కడ సృష్టించారో ఆధారాలతో సహా చైనా బయటకు చెప్పాలి. వైరస్​ను గుర్తించిన వాళ్లు మాయమయ్యారు. మీడియాపై ఆంక్షలు విధించారు. వైద్య నిపుణులు సాయం చేస్తామంటే తిరస్కరించారు. వుహాన్​లో రెండు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అక్కడే మాంసపు మార్కెట్లు ఉన్నాయి. నాకు తెలిసి మిగతా దేశాలు కూడా ఈ సంక్షోభానికి చైనానే కారణంగా భావిస్తున్నాయి."

- రాబర్ట్ ఒబ్రెయిన్​, అమెరికా ఎన్​ఎస్​ఏ

ఇదీ చూడండి:60 రోజుల పాటు గ్రీన్​కార్డుల మంజూరు నిలిపేసిన అమెరికా

Last Updated : Apr 22, 2020, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details