వరుస భూకంపాలు (Haiti Earthquake).. భారీ వరదలు.. ఇలా వరుస విపత్తులతో ఉత్తర అమెరికా దేశం హైతీ(Haiti news) అట్టుడికిపోయింది. ఆపై అధ్యక్షుడి హత్య (Haiti President Assassinated) దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. పొట్టచేత పట్టుకొని.. వలస బాట పట్టారు హైతీయన్లు. వేలాది మంది.. హైతీ సరిహద్దుల్లోని మెక్సికో, అమెరికాకు తరలివెళ్లారు. మెక్సికో ఆంక్షలతో.. ఈ రెండు దేశాలను(అమెరికా, మెక్సికో) వేరుచేసే రియో గ్రాండి నది మీదుగా యూఎస్‌లోని టెక్సాస్ సరిహద్దులకు (Texas border crisis) చేరుకున్నారు. వారంతా తాళ్ల సాయంతో.. నది దాటుతున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాలు చిత్రీకరించాయి.
అక్కడే మెక్సికో- టెక్సాస్ సరిహద్దుల్లో (US Mexico border news) వేలాది మంది హైతీయన్లు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకొని.. అమెరికా ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలు ఫలించలేదు.
ఇప్పుడీ చొరబాట్లను అడ్డుకునేందుకు.. అమెరికా కూడా చర్యలకు ఉపక్రమించింది. వారిని తిరిగి హైతీకి పంపేందుకు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది జో బైడెన్ సర్కార్(Joe Biden news). ఈ క్రమంలోనే.. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు హైతీ వాసులు.
ఎటు వెళ్లాలో తెలియక వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసేదేంలేక కొందరు మెక్సికో వైపు, మరికొందరు అమెరికా వైపు మళ్లుతున్నారు. తిండీతిప్పలు లేక అల్లాడిపోతున్నారు.
హైతీయన్లపై అమెరికా సరిహద్దు (US border crisis) సిబ్బంది దాడుల పట్ల రిపబ్లికన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైతీ(Haiti news) వాసులను చెదరగొట్టేందుకు.. వారిని గుర్రాలతో వెంబడించారు బోర్డర్ ఏజెంట్లు. బలవంతంగా విమానాల్లోకి ఎక్కిస్తున్నారు. దీనిని తప్పుబడుతున్న రిపబ్లికన్లు.. సంక్షోభాన్ని ఎదుర్కోలేక బైడెన్ చేతులెత్తేశారని ఆరోపిస్తున్నారు.
ఓవైపు ఆంక్షలు.. వెనక్కివెళ్లాలని ఆదేశాలు.. మరోవైపు ఆకలికేకలు.. ఏం చేయాలో తెలియదు. ఎటు వెళ్లాలో స్పష్టత లేదు. ఇలా ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే.
అయితే.. ఈ కఠిన పరిస్థితులు.. తమకూ సవాల్ విసురుతున్నాయని అంటున్నారు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కస్. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే హైతీయన్లు తమ కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టకుండా, తిరిగి వెనక్కి వెళ్లడమే మంచిదని హెచ్చరించారు.
'మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..'
టెక్సాస్ సరిహద్దు నగరం(Texas border crisis) డెల్ రియోలోని (Del Rio border crossing) ఒక్క వంతెన కిందే.. 14 వేల మందికిపైగా వలసదారులు ఉన్నారు. దాదాపు 6 వేల మందిని హైతీకి పంపించామని, మరో 8 వేలమందికిపైగా ఇంకా ఉన్నారని అన్నారు టెక్సాస్ గవర్నర్, రిపబ్లికన్ గ్రెగ్ అబాట్. సమస్యకు పరిష్కారం కనుగొనాలని.. చట్ట ప్రకారం నడుచుకోవాలని దేశ అధ్యక్షుడికి సూచించారు. వలసదారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని హితబోధ చేశారు.
''ఈ వలసదారులను అందరినీ తరలించే ప్రక్రియను ఈ వారం చివర్లోగా పూర్తి చేసే సామర్థ్యం బైడెన్ సర్కార్‌కు లేదు. వారు చేయగలిగేది ఏంటంటే.. అసలు ఇది ఉనికిలోనే లేదని నిక్కచ్చిగా చెప్పగలిగే అసమర్థత. కానీ.. వలసదారులతో గందరగోళం నెలకొంది అని తెలియపర్చడానికే మేం ఇక్కడ ఉన్నాం. అయితే.. బైడెన్ యంత్రాంగం సరైన రీతిలో వ్యవహరించాలి.''