తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్బులు గాల్లోకి ఎగరేస్తూ 'దొంగ తాత' క్రిస్మస్​ శుభాకాంక్షలు - White-bearded 'Merry Christmas' bank robber throws cash at passers-by

ఎవరికైనా క్రిస్మస్​ శుభాకాంక్షలు చెప్పాలంటే ఎలా చెబుతాం? ఏ చాక్లెటో.. పార్టీనో లేదంటే బహుమతి ఇచ్చో ఒకరికొకరం శుభాభినందనలు తెలుపుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధుడు మాత్రం సరికొత్తగా డబ్బులు గాల్లోకి ఎగరేస్తూ అందరికీ క్రిస్మస్​ శుభాకాంక్షలు చెప్పాడు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

White-bearded 'Merry Christmas' bank robber throws cash at passers-by
డబ్బులు గాల్లోకి ఎగరేస్తూ 'దొంగ తాత' క్రిస్మస్​ శుభాకాంక్షలు

By

Published : Dec 25, 2019, 5:18 PM IST

అమెరికాకు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధుడు వినూత్నంగా క్రిస్మస్​ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడో ఏమో... ఓ బ్యాంకుకు వెళ్లి లూఠీ చేసేశాడు. అదేంటి...? శుభాకాంక్షలకు, బ్యాంకు లూఠీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి..

డేవిడ్​ వేన్​ ఒలివర్​ అనే 65 ఏళ్ల వృద్ధుడు క్రిస్మస్​ పండుగకు రెండు రోజల ముందు కొలరాడో స్ప్రింగ్స్​లోని అకాడెమీ బ్యాంకుకు వెళ్లాడు. సోమవారం మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఓ మారణాయుధంతో అక్కడి ఉద్యోగులను బెదిరించి బ్యాంకు నుంచి కొంత సొమ్మును లూఠీ చేశాడు. అయితే అది దాచుకోవడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. దొంగిలించిన డబ్బును గాల్లోకి ఎగరేస్తూ.. 'మెర్రీ క్రిస్మస్'​ అని అరుస్తూ అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు ఒలివర్​. ఈ తాత చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ సొమ్ము బ్యాంకు నుంచి దోపిడీ చేసిందని తెలుసుకున్న స్థానికులు కొంత మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి ఇచ్చేశారు. చివరకు స్టార్​బక్స్​ సమీపంలో ఒలివర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : 'ఆస్ట్రేలియా ఓపెన్' ప్రైజ్​మనీ భారీగా పెరిగిందోచ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details