అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్(270)కు దాదాపు చేరువయ్యారు. అయితే.. ఇంకా ఫలితం తేలాల్సిన రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు రాగా.. మరో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు రావాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా...
ఇదీ చదవండి:ట్రంప్xబైడెన్: అమెరికాలో నిరసనల హోరు
పెన్సిల్వేనియా
ఈ రాష్ట్రంలో ట్రంప్.. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే.. ఇక్కడ ఇంకా 7,65,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇందులో కనీసం 59 నుంచి 61శాతం ఓట్లు డెమొక్రటిక్ అభ్యర్థి వస్తేనే గానీ పెన్సిల్వేనియాలో బైడెన్ నెగ్గలేరు.
జార్జియా
జార్జియాలోనూ ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. బైడెన్‌పై ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. ఇక్కడి ఓట్ల లెక్కింపుపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఇక్కడ ఓడిపోతే రీకౌంటింగ్ చేయాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు.
నార్త్ కరోలినా