కొవిడ్ మహమ్మారికి విరుగుడు అయిన వ్యాక్సిన్.. అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనూ రెండు టీకాలకు అనుమతి లభించిన తర్వాత.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇందులో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, రెండో దశలో వృద్ధులు, 45- 60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇస్తున్నారు.
ఇదీ చూడండి:వ్యాక్సినేషన్ 2.0: నమోదు ఎలా? టీకా కేంద్రం ఎక్కడ?
మరి చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం.. వీరిపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరపకపోవడం. అయితే.. అందుకు ఎంతో సమయం లేదంటున్నారు పరిశోధకులు.
విదేశాల్లో అనుమతులు పొందిన ఫైజర్ వ్యాక్సిన్ 16 ఏళ్లకు పైబడిన వారికే వినియోగించాల్సి ఉంటుంది. అయితే.. ఆయా దేశాల్లో వీరిని అర్హులుగా ప్రకటిస్తే ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో కొందరు వ్యాక్సిన్ పొందనున్నారు.
మరోవైపు మోడెర్నా టీకాను.. 18 అంతకంటే ఎక్కువ వయస్కుల్లో వినియోగించేందుకు అనుమతి ఉంది.
టీనేజర్లలో..
12 ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగాలను ఫైజర్, మోడెర్నా ఇప్పటికే ప్రారంభించాయి. వీటి ఫలితాలను వేసవిలో విడుదల చేసే అవకాశముంది. వీటి సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. ఔషధ నియంత్రణ సంస్థల అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఈ టీనేజర్లకూ టీకా అందనుంది.
అయితే.. 12 ఏళ్ల కంటే తక్కువ వయస్కులపై ప్రయోగాలు జరపడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావిస్తున్నారు పరిశోధకులు. వీరిలో టీకా భిన్నమైన ప్రతిస్పందనలు చూపించే అవకాశం ఉందని మేరీలాండ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
పిల్లల్లో రోగనిరోధకతను పెంచేందుకు వారికీ టీకా ఇవ్వాలనుకుంటున్నట్లు అమెరికాలోని డెక్సెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. సారా లాంగ్ చెబుతున్నారు. కరోనా వైరస్ వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురికావడం, మరణించడం వంటి సంఘటనలు తక్కువే అయినప్పటికీ.. వారి నుంచి వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు.
ఈ ఏడాది చివర్లో.. వీరిపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి:మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!
శశికళ గుడ్‌బై: లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?