తెలంగాణ

telangana

ETV Bharat / international

వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలకు అంతరాయం! - అమెరికా

మీ ఫోన్​లో వాట్సాప్​ పనిచేయటం లేదా? మీ ఒక్కరికే కాదు.. ప్రపంచంలో చాలా మందికి బుధవారం ఇదే సమస్య తలెత్తింది. అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియాలోని పలు దేశాల్లో వాట్సాప్​తో పాటు ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లకు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాట్సాప్

By

Published : Jul 3, 2019, 9:50 PM IST

Updated : Jul 3, 2019, 10:21 PM IST

వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో బుధవారం ఉదయం సేవలు స్తంభించాయి. డేటా డౌన్​లోడింగ్​లో సమస్యలు వస్తున్నట్లు ట్విట్టర్​లో వేల మంది 'వాట్సాప్​డౌన్' హ్యాష్​ట్యాగ్​తో​ పోస్ట్​ చేస్తున్నారు.

భారత్​లో ఉదయం బాగానే ఉన్నా, సాయంత్రానికి అంతరాయం కలిగిందని ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ వాట్సాప్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డేటాను ఇతరులకు పంపించటంలో ఎలాంటి సమస్య లేకపోయినా డౌన్​లోడ్​ కావట్లేదని చెబుతున్నారు. భారత్​లో బుధవారం రాత్రి 8.30 నుంచి గంటపాటు ఈ 3 మాధ్యమాల సేవలు నిలిచిపోయినట్లు పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపించారు.

ఇదీ చూడండి: వాట్సాప్​తో ఒంటిరితనం దూరం.. ఆరోగ్యం పదిలం

Last Updated : Jul 3, 2019, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details