తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​, బైడెన్​ మధ్య టై అయితే..? - తాజా వార్తలు ట్రంప్

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​, బైడెన్​ మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరికీ 269 చొప్పును ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు వచ్చి.. ఎన్నికలు టై అయితే పరిస్థితి ఏంటి?

WHAT WILL HAPPEN WHEN IT WAS TIE BETWEEN TRUMP AND BIDEN
ట్రంప్​, బైడెన్​ మధ్య టై అయితే..?

By

Published : Nov 3, 2020, 6:00 AM IST

Updated : Nov 3, 2020, 10:18 AM IST

నేడు జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిది? మళ్లీ ట్రంప్​దే అధికారమా? లేక ఈసారి ప్రజలు బైడెన్​కే పట్టం కడతారా? ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. మరి ఒకవేళ ఎన్నికలు టై అయితే పరిస్థితి ఏంటి? ట్రంప్​, బైడెన్​ ఇద్దరికీ 269 చొప్పున ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు వస్తే.. ఏం చేస్తారు?

రాజ్యాంగం ఏం చెబుతోంది?

టై పరిస్థితిని ఊహించిన అమెరికన్ రాజ్యాంగం.. దాన్ని అధిగమించడానికి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. ఎలక్టోరల్​ కాలేజీ ద్వారా విజేతను ఎంపిక చేయడం కుదరకపోతే 2వ అధికరణంలోని సెక్షన్ 1లో మూడో క్లాజు ప్రకారం.. అధ్యక్షుడ్ని కాంగ్రెస్​లోని ప్రతినిధుల సభ ఎన్నుకోవాలి. ఉపాధ్యక్షుడిని సెనేట్​ ఎన్నుకుంటుంది. అయితే సెనేట్​లో ఉపాధ్యక్ష ఎన్నిక కోసం ఒక్కో సెనేటర్​కు ఒక ఓటు దక్కుతుంది.

అధ్యక్ష ఎన్నిక కోసం ప్రతినిధుల సభలో రాష్ట్రానికి ఒకటి చొప్పున మాత్రమే ఓటు ఉంటుంది. ఆ రాష్ట్ర పరిమాణంతో దీనికి సంబంధం లేదు. ఈ లెక్కన అధ్యక్షుడు గెలవడానికి 26 రాష్ట్రాల మద్దతు అవసరం. ప్రస్తుత సభలో అలాంటి బలం రిపబ్లికన్లకు ఉంది. డెమొక్రాట్లకు 23 రాష్ట్రాల్లో ఆధిపత్యం ఉంది. కానీ ఇది ట్రంప్​కు ఉపయోగపడదు. ఎందుకంటే ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతో పాటు కాంగ్రెస్​కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.

అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రకటించగానే కొత్త కాంగ్రెస్​ ఫలితాలు కూడా తెలుస్తాయి. అందులో ఎవరికి మెజారిటీ వస్తుందో చెప్పలేం. అయితే అధ్యక్ష ఎన్నిక సమం అయినట్లయితే కాంగ్రెస్​కు జరుగుతున్న ఎన్నికలు కూడా కీలకమే.

Last Updated : Nov 3, 2020, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details