అమెరికా ఎగువసభలో ఆధిక్యం సమాంతరంగా విడిపోవడం ఆసక్తికరంగా మారింది. జార్జియాలో ఇద్దరు డెమొక్రటిక్ అభ్యర్థుల గెలుపుతో సెనేట్‌లో ఇరుపార్టీల బలం 50-50కి చేరింది. సభాధ్యక్ష హోదాలో కమలా హారిస్ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి.. మెజారిటీ డెమొక్రాట్ల వైపే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ సాధారణ మెజారిటీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తన ప్రణాళికలను పార్లమెంట్ గడప దాటించగలుగుతారా? మూడొంతుల మెజారిటీ అవసరమయ్యే బిల్లుల కోసం రిపబ్లికన్ల నుంచి ఎంతవరకు మద్దతు కూడగడతారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.
కలిసొచ్చేవి ఇవే!
1. నామినేషన్లు
సెనేట్ అధ్యక్ష కుర్చీపై డెమొక్రటిక్ నేత కమలా హారిస్ ఉన్నందున అధ్యక్షుడు తన మంత్రివర్గానికి ఎంపిక చేసిన నామినేషన్లు సులువుగానే పార్లమెంట్ గడప దాటనున్నాయి. సుప్రీంకోర్టు సహా ఇతర కోర్టులకు న్యాయమూర్తుల ఎంపిక సైతం సులభంగానే సాగనుంది. ఈ ప్రక్రియను రిపబ్లికన్లు ఆలస్యం చేసే అవకాశం ఉంది. కానీ అడ్డుకోవడం మాత్రం అసాధ్యం.
2. బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్!
బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యేక బిల్లులు సాధారణ మెజారిటీతోనే సెనేట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. బడ్జెట్ బిల్లులో మార్పులు సైతం చేసే వీలు ఉంటుంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన పన్ను మినహాయింపులను వెనక్కి తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ వైద్య సంరక్షణ చర్యలను మరింత సులభతరం చేయడానికి బైడెన్‌కు అవకాశం దక్కింది.
3. అజెండా కోసం
కమలా హారిస్ స్థానంలో వచ్చిన అలెక్స్ పాడిలాతో కలిసి మొత్తం ముగ్గురు సభ్యులు సెనేట్‌లో అడుగుపెట్టినందున.. సభలో మెజారిటీ లీడర్ హోదా డెమొక్రటిక్ నేత చక్ షూమర్‌ను వరించింది. బిల్లులను సభలో ప్రవేశపెట్టి, ఓట్లు కోరే అవకాశం ఆయనకు లభించింది. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలపై చర్చకు పిలుపునిచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ బిల్లులకు మాత్రం రిపబ్లికన్ల మద్దతు అనివార్యం అవుతుంది.
అమెరికాలోని కుటుంబాలకు రెండు వేల డాలర్లను అందించే కరోనా ఉద్దీపన ప్యాకేజీ సెనేట్ ఆమోదం పొందే అవకాశం ఉంది.
బైడెన్‌కు ఎదురయ్యే సవాళ్లు