అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను పొరపాటున బహిర్గతం చేశారు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కైలీ మెక్ఎనాని. ఆ దేశ ఆరోగ్య, ప్రజా సేవల విభాగం (హెచ్హెచ్ఎస్)కు ట్రంప్ అందించిన చెక్కు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
గత బుధవారం (మే 20న) జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఖాతా వివరాలు వెల్లడించారు మెక్ఎనాని. కరోనా వైరస్ కట్టడి, నివారణ, కేసుల నిర్ధరణ వంటి చర్యలకు సాయంగా హెచ్హెచ్ఎస్ విభాగానికి అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత ఆదాయంలో నుంచి ఒక లక్ష డాలర్లు విరాళం ఇస్తున్నారంటూ ఓ చెక్కును ప్రదర్శించారు. తద్వారా ట్రంప్ వ్యక్తిగత ఖాతా వివరాలు బహిర్గతం అయ్యాయని పేర్కొంటూ డైలీ మెయిల్ పత్రిక కథనం ప్రచురించింది.
ట్రంప్ ఖాతా వివరాల బహిర్గతంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో శ్వేతసౌధం అధికార ప్రతినిధి జుడ్ డీర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వైరస్ను ఎదుర్కొనేందుకు అధునాతన థెరపీలకు సాయం చేసేందుకు అధ్యక్షుడి జీతం వెళుతోందన్నారు. చెక్కు నిజమైనదా కాదా అనే దానిపై కాకుండా నిఖార్సయిన వార్తల్ని ప్రజలకు అందించడంపై మీడియా దృష్టి పెట్టాలని హితవు పలికారు.
సామాజిక మాధ్యమాల్లో..