తెలంగాణ

telangana

ETV Bharat / international

'మహమ్మారి మూలాలను తెలుసుకోవాలి' - శ్వేతసౌధం కరోనా సలహాదారు

కరోనా మహమ్మారి మూలాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శ్వేతసౌధంలో కరోనా సలహాదారు ఆండీ స్లావిట్ అభిప్రాయపడ్డారు. మరోవైపు మహమ్మారి పుట్టుక విషయం దర్యాప్తు చేయాల్సిన అంశమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు.

white house
శ్వేతసౌధం

By

Published : May 26, 2021, 7:36 AM IST

కొవిడ్-19 మహమ్మారి మూలాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శ్వేతసౌధంలో కరోనా సలహాదారు ఆండీ స్లావిట్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, చైనాలు వైరస్​పై ఉన్న సమాధానాలు, సందేహాలను ప్రపంచానికి వివరించాలన్నారు.

" మహమ్మారి పుట్టుక విషయంలో మనకు.. చైనా పారదర్శకమైన విధానం అందించాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కూడా పూర్తి సహకారం అందించాలి. కానీ అది జరగటం లేదు."

-- ఆండీ స్లావిట్, శ్వేతసౌధం కొవిడ్​-19 సలహాదారు

"కరోనా మహమ్మారి సాధారణంగా ప్రబలిన వ్యాధిగా మనం అనుకుంటున్నాం. కానీ అది 100 శాతం నిజం కాదు. ఇది దర్యాప్తు చేయాల్సిన అంశం" అని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.

కరోనా మహమ్మారి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందా? లేక చైనాలోని వుహాన్ ల్యాబ్​ నుంచి ప్రబలిందా? అన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి.

ఇదీ చదవండి :'ఆక్సిజన్ స్థాయి, శ్వాస రేటే కీలకం'

ABOUT THE AUTHOR

...view details