2022 మధ్యంతర ఎన్నికల్లో తనకు విధేయంగా ఉండే అభ్యర్థులకు మద్దతివ్వాలని రిపబ్లికన్లను కోరారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత 2024లో మరోసారి పోటీ చేస్తానని ఇదివరకే సంకేతాలు ఇచ్చిన ట్రంప్.. ఆ దిశగా ముందడుగు వేశారు. పార్టీని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు వందలాది రిపబ్లికన్ నేతలు, కార్యకర్తలతో నార్త్ కరోలినా రిపబ్లికన్ కన్వెన్షన్లో ఆయన సమావేశమయ్యారు.
"2024లో నార్త్ కరోలినాను గెలవబోతున్నాం. అందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తాం. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల నుంచి ప్రతి స్థాయిలో రిపబ్లికన్లను ఎన్నుకోవడం పైనే అమెరికా మనుగడ ఆధారపడి ఉంది."