తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ నగరంపై దుండగులు దండయాత్ర- బ్యాంక్​ లూటీ

బ్రెజిల్​లోని క్రిసియామా నగరంపై అర్ధరాత్రి వేళ దాదాపు 30మంది క్రిమినల్స్​ దండయాత్ర చేశారు. భారీ ఆయుధాలతో వీధులపై బీభత్సం సృష్టించి.. స్థానిక బ్యాంక్​ను దోచుకెళ్లారు. మొత్తం రెండు గంటల పాటు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు తమను పట్టుకోకుండా పక్కా ప్రణాళిక రచించారు.

Well-prepared robbers seize Brazilian city, loot bank
ఆ నగరంపై దుండగులు దండయాత్ర- బ్యాంక్​ లూటీ

By

Published : Dec 1, 2020, 8:01 PM IST

బ్రెజిల్​లోని ఓ నగరంపై దుండగులు దండయాత్ర చేశారు. అర్ధరాత్రి వేళ.. భారీ ఆయుధాలతో నగర వీధులను ఆక్రమించుకుని స్థానిక బ్యాంక్​ను లూటీ చేశారు.

సాంటా కటారీనా రాష్ట్రంలోని క్రిసియామా నగర విధుల్లో అర్ధరాత్రి పూట నల్ల దుస్తులు ధరించిన వ్యక్తులు బీభత్సం సృష్టించారు. స్థానికులను బెదిరించి బందీగా తీసుకున్నారు. నగరం అంతా.. తుపాకీ శబ్దాలతో మారుమోగిపోయింది. 10 వాహనాల్లో వచ్చిన దాదాపు 30 క్రిమినల్స్​ నగరంపై విరుచుకుపడ్డారు. పక్కా ప్రణాళిక రచించి.. పోలీసులు అక్కడి చేరుకోకుండా అన్ని పాయింట్లను మూసివేశారు.

ఈ ఘటనను స్థానికులు తమ ఫోన్లల్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

రెండు గంటల్లో పని పూర్తి..

మొత్తం రెండు గంటల పాటు నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు నేరగాళ్లు. వెనక్కి వెళుతున్నప్పుడు.. ఓ బ్యాంక్​ వాల్ట్​ను తమతో పాటు తీసుకెళ్లారు. నగర రోడ్ల మీద బిల్స్​ చెల్లాచెదురుగా పడ్డాయి.

నగర జనాభా 2,20,000. కాగా ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని క్రిసియామా మేయర్​ పిలుపునిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగినట్టు వివరించారు.

ఇదీ చూడండి:-రైతులకు కెనడా ప్రధాని మద్దతు- భారత్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details