హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌కు 23 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది న్యూయార్క్ కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన వైన్‌స్టీన్‌కు బుధవారం శిక్ష ఖరారు చేసింది.
వైన్‌స్టీన్ పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013లో న్యూయార్క్ నగరంలోని ఓ హోటల్లో.. ఓ నటిపై అత్యాచారం, 2006లో మిమి హలేయీపై లైంగిక దాడుల కేసుల్లో గత నెల దోషిగా తేల్చింది కోర్టు.
ప్రస్తుతం విధించిన శిక్షతో పాటు గరిష్ఠంగా 29 ఏళ్లపాటు జైలులో గడపనున్నాడు వైన్‌స్టీన్.
బుధవారం కోర్టులో విచారణ సందర్భంగా తమకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు బాధిత మహిళలు. ఈ సందర్భంగా తాను ఈ పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్లు కోర్టుకు తెలిపాడు వైన్‌స్టీన్. తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. కేసుతో కలత చెందినట్లు పేర్కొన్నాడు. కానీ జైలు శిక్ష విధించటంపై స్పందించేందుకు నిరాకరించాడు.