cloth mask news: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అటు ప్రభుత్వాలు.. ఇటు శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. నిజానికి వైరస్ నుంచి రక్షణలో మాస్క్‌లు అత్యంత కీలకం అయినప్పటికీ.. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్‌ను ఒంటబట్టించుకున్నాయి. దీంతో రంగురంగుల, తిరిగి ఉపయోగించే క్లాత్ మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరి వీటిని ఉపయోగించడం ఎంతవరకూ ప్రయోజనకరం అంటే.. పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా సింగిల్ లేయర్ మాస్క్‌లను వాడకపోవడమే మేలని చెబుతున్నారు. వీటి వల్ల కేవలం 20 నిమిషాల్లోనే వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మాస్క్‌ల వినియోగంపై అమెరికన్ కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇండస్ట్రియల్ హైజీనిస్ట్స్‌తో పాటు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పలు అధ్యయనాలు జరిపింది. వీటి ప్రకారం..
- ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించకుండా ఆరు అడుగుల దూరంలో నిలబడితే.. అందులో ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ ఉంటే.. అప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ సోకుతుంది.
- ఒకవేళ ఇద్దరిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాస్క్ లేకుండా.. అవతలి వ్యక్తి క్లాత్ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్ 20 నిమిషాల్లో సోకుతుంది.
- ఇక, ఇద్దరూ క్లాత్ మాస్క్‌లు ధరిస్తే గనుక.. 27 నిమిషాల్లో వైరస్ వ్యాపిస్తుంది.
- ఒకవేళ ఇద్దరిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మాస్క్ లేకుండా.. అవతలి వ్యక్తి కేవలం సర్జికల్ మాస్క్ ధరించినట్లయితే.. అప్పుడు వైరస్ 30 నిమిషాల్లో మరో వ్యక్తికి సోకుతుంది.
- అదే ఇద్దరిలో ఒకరు ఎన్95 మాస్క్ ధరించి.. మరో వ్యక్తి పూర్తిగా మాస్క్ పెట్టుకోకపోతే కనీసం 2.5 గంటల్లో వైరస్ వ్యాపిస్తుంది.
- ఇద్దరూ ఎన్95 మాస్క్‌లు ధరిస్తే.. వైరస్ వ్యాప్తి చెందడానికి కనీసం 25 గంటల సమయం పడుతుందని అధ్యయనంలో తేలింది.
రెండు మాస్క్‌లు మేలు..