తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆమె జుట్టే డ్రెస్​- నెటిజన్లు షాక్​ - జుట్టే డ్రెస్సు

జుట్టు పొడవుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా పెద్దగా పెంచుకోవాలని కొందరి కల. ఒకవేళ పెరిగినా.. అడ్డగోలుగా కాకుండా సరైన రీతిలో ఉంచుకునేందుకు చాలానే శ్రమపడాల్సి వస్తుంది. కానీ.. ఈ యువతి మాత్రం తన జుట్టుతోనే ప్రత్యేకంగా నిలిచింది.

Woman Wears Her Long Hair as Dress
ఆమె జుట్టే డ్రెస్

By

Published : Jun 29, 2021, 4:37 PM IST

తన జుట్టుతోనే వార్తల్లో నిలిచిందో యువతి. ఏళ్లుగా పెంచుకున్న ఆ బారెడు జడనే డ్రెస్సుగా మలచుకుంది. ఆమె ఫొటోలు చూసిన నెటిజన్లు.. అంత పెద్దగా ఎలా పెరిగిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు.

జుట్టునే డ్రెస్​గా మలిచి

సన్​గ్లాసెస్​, టోపీ ధరించినా.. ఆ యువతి డ్రెస్సుపైనే అందరి దృష్టి పడింది. పొడుగ్గా పెరిగిన జుట్టును.. మధ్యలో బెల్టుతో బిగించి మోకాళ్లపైభాగం వరకు సర్దేసింది. యువతి స్టైలిష్​ లుక్​తో ఉన్న ఆ వీడియోను.. హెప్​గల్​5(hepgul5) అనే ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేశారు. ఈ వినూత్న వీడియోకు నెట్టింట మంచి స్పందన లభిస్తోంది.

చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొందరు విచిత్రంగా ఉందని చెప్పగా, ఇంటర్నెట్​లో వైరల్​ అయ్యేందుకు విగ్​తో అలా చేయలేదుకదా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details