తైవాన్ విషయంలో (Taiwan news ) అగ్రదేశాలు అమెరికా, చైనాల మాటల యుద్ధం తీవ్రమైంది. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను (Taiwan China news) తాము రక్షిస్తామని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్(biden taiwan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్ ఉందని వెల్లడించారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో భాగంగా బైడెన్ (Biden news) ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ తెలుసు.. తాము ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని' ఆయన పేర్కొన్నారు.
మరోవైపు తైవాన్ విషయంలో అమెరికా పాలసీల్లో ఎటువంటి మార్పులు లేవని వైట్‌హౌస్ అధికారులు స్పష్టం చేశారు. తైవాన్ విషయంలో చైనా (Taiwan news china) కొన్నాళ్లుగా దుందుడుకు ధోరణి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తైవాన్‌ను తమ భూమిగా పేర్కొంటూ.. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తైవాన్ గగనతలంలోకి ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించింది. కొన్నాళ్లుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్- చైనాలను ఏకం చేసి తీరతామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సైతం వ్యాఖ్యానించారు. మరోవైపు తైవాన్ సైతం డ్రాగన్ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తేల్చి చెబుతూ వస్తోంది.