అధికారం చేపట్టినప్పటి నుంచి తాత్కాలిక నివాసంలోనే ఉంటున్నారుఅమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు తన అధికారిక నివాసంలోకి వెళ్లనున్నారు. ఈ వారంలో ఆమె తన భర్త డగ్ ఎమ్హోఫ్తో కలిసి ఉపాధ్యక్షుల కోసం కేటాయించిన భవనం(నావల్ అబ్జర్వేటరీ)లోకి మారనున్నారు. ఇటీవలే అధికారిక భవనంలో మరమ్మతులు పూర్తి అయ్యాయి.
నావల్ అబ్జర్వేటరీలో ప్లంబింగ్, హీటింగ్, ఎయిర్ కండీషనింగ్కు సంబంధించిన మరమ్మతులు జరిగాయి. అంతకుముందు ఈ భవనంలో ఉన్న మైక్ పెన్స్ దంపతులు ఖాళీ చేసి వెళ్లాక.. మరమ్మతు పనులు సులభంగా చేయగలిగామని అధికారులు తెలిపారు.