తెలంగాణ

telangana

ETV Bharat / international

భగ్గుమన్న 'కిలాయియా' అగ్నిపర్వతం

హవాయిలోని కిలాయియా అగ్నిపర్వతం పేలింది. ఫలితంగా అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అర్థరాత్రి నీలాకాశం ఉన్నఫళంగా ఎర్రగా మారింది. ఆ ప్రాంతంలోని ఓ సరస్సు నీటితో కలిసి లావా ధారాళంగా ప్రవహించింది.

Volcano erupts on Hawaii's Big Island, draws crowds to park
భగ్గుమన్న 'కిలాయియా' అగ్నిపర్వతం

By

Published : Dec 22, 2020, 2:20 PM IST

భగ్గుమన్న 'కిలాయియా' అగ్నిపర్వతం

హవాయిలోని కిలాయియా అగ్నిపర్వతం భగ్గుమంది. లావా ధారాళంగా ప్రవహిచింది. అగ్నిపర్వతం ధాటికి ఆకాశంలో గ్యాస్​, తేమ పెరిగాయి. బూడిద కూడా ఎగసిపడింది.

"నీటితో లావా కలిస్తే పేలుడు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం జరిగిన ఘటనలో లావా బిలంలోని నీటితో కలిసింది. ఫలితంగా గంటపాటు లావా ధారాళంగా ప్రవహించింది. పక్కన ఉన్న సరస్సులోని నీరంతా ఆవిరైపోయింది".

-బిర్​చర్డ్, వాతావరణ నిపుణుడు.

కిలాయియా అగ్నిపర్వత ప్రాంతం సమీపంలోని ప్రజలకు ఈ పేలుడు వల్ల పెద్దగా ఇబ్బంది తలెత్తలేదని అమెరికా జియోలాజికల్​ సర్వే వెల్లడించింది.

సోమవారం వరకు ఈ లావా ప్రవాహం కొనసాగింది. ఇది ఇంకా ఎంత సేపు ఉంటుందనేది అంచనా వేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిలో ఎగసిపడిన బూడిద కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదకారమని హెచ్చరించారు.

అయితే ఆదివారం అగ్నిపర్వతం పేలుడు మొదలైన గంట తర్వాత ఆ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​ పై 4.4 తీవ్రత నమోదైంది.

ఇదీ చదవండి:నేపాల్​ దారెటు? భారత్​పై ప్రభావమెంత?

ABOUT THE AUTHOR

...view details