హోరాహోరీగా సాగుతున్న 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల క్రతువు.. ఒక్కో పర్వం పూర్తి చేసుకుంటోంది. అభ్యర్థులిద్దరూ నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్న తరుణంలోనే కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ జరుగుతోంది.
మొదలైన ముందస్తు పోలింగ్..
అమెరికాలో 2020-అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నవంబర్ 3న జరగాలి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ముందే ప్రారంభమైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో ఇలాంటిది జరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్ష పోలింగ్ జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మెయిళ్ల రూపంలో ఉంటుంది. అయితే, ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ ముందస్తు పోలింగ్ జరుగుతుంటుంది.
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి... కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లోనే మొదలైంది పోలింగ్. మరికొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ మధ్యలో, నవంబర్‌లో పోలింగ్ రోజుకు ముందు జరుగుతాయి.
లెక్కింపు మార్గాలు
ముందస్తు ఓట్లు వేసేందుకు 50 వేర్వేరు మార్గాలు ఉన్నట్లే.. ఈ ఓట్ల లెక్కింపునకు సైతం విభిన్న అవకాశాలున్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తాయి. ఓటింగ్‌లో భాగంగా వచ్చిన ఎన్వలప్‌లను తెరిచి.. ఓటర్ల సంతకం సహా అన్ని అంశాలు సరిచూసుకుంటారు. పట్టిక కోసం బ్యాలెట్లను సరైన పద్ధతిలో క్రమబద్ధీకరిస్తారు. ఈ ప్రక్రియ పోలింగ్ రోజుకు 3 వారాల ముందే మొదలవుతుంది.
మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ రోజే.. ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. చాలాసార్లు సమయాభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
డెమొక్రాట్ల అభ్యంతరాలు
ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని కీలకమైన రాష్ట్రాలో ఇందే పంథా అనుసరిస్తున్నారు. ఈ అంశంపై డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానం వల్ల.. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. తమకు మద్దతున్న చోట్ల.. లెక్కింపు ఆలస్యం కావటం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆసుపత్రిలో ట్రంప్- కోలుకోవాలని ఆకాంక్షించిన కిమ్
ఇదీ చూడండి:'కరోనా' కథ మార్చేనా..! ట్రంప్‌కు వైరస్ సోకడంపై సర్వత్రా చర్చ