తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశాల్లో మళ్లీ కరోనా టాప్ ​గేర్​ - కరోనా వైరస్​ కేసులు

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా కొనసాగుతోంది. మొత్తం 97,47,721మందికి వైరస్​ సోకింది. 4,92,552మంది మరణించారు. వైరస్​ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందనుకున్న దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Virus on rise in US, other countries with big populations
ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆందోళనకరంగా కరోనా వ్యాప్తి

By

Published : Jun 26, 2020, 7:26 PM IST

ప్రపంచ దేశాలో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 97,47,721కేసులు నమోదయ్యాయి. 4,92,552మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కరోనా 2.0 తగ్గుముఖం పట్టింది. అయితే అమెరికా, మెక్సికో, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్​, ఇండోనేషియాలో వైరస్​ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

దేశం కేసులు మరణాలు
అమెరికా 25,05,909 1,26,823
బ్రెజిల్​ 12,33,147 55,054
రష్యా 6,20,794 8,781
బ్రిటన్​ 3,07,980 43,230
స్పెయిన్​ 2,94,566 28,330
పెరూ 2,68,602 8,761
చిలీ 2,59,064 4,903
ఇటలీ 2,39,706 34,678
ఇరాన్​ 2,17,724 10,239

అమెరికాలో అత్యధిక కేసులు...

అమెరికాలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా కేసుల సంఖ్య ఏప్రిల్​ నెల అత్యధిక స్థాయికి చేరింది. ఆరిజోనా రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు 3వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల ఎత్తివేత ప్రణాళికలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

దక్షిణాఫ్రికాలో పెరుగుదల...

ఆఫ్రికా ఖండంలో సగానికిపైగా కేసులు నమోదైన దక్షిణాఫ్రికాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా 6,579కేసులు బయటపడ్డాయి.

ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్​ను అత్యంత కఠినంగా అమలు చేసిన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. అప్పుడు వైరస్​ను కట్టడి చేయగలిగినప్పటికీ.. ఆంక్షల ఎత్తివేత అనంతరం వైరస్​ తిరిగి విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1,18,375 కేసులు వెలుగుచూశాయి. 2,292మంది వైరస్​కు బలయ్యారు.

బ్రిటన్​ హెచ్చరిక...

బ్రిటన్​లో ఓవైపు వైరస్​ కేసులు పెరుగుతున్నప్పటికీ.. అక్కడి బీచ్​లు, రైళ్లు రద్దీగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ఆ దేశ ఆరోగ్యమంత్రి మాట్​ హెన్​కాక్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రజలకు గుర్తుచేశారు.

సింగపూర్​ కీలక నిర్ణయం..

పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని సింగపూర్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్వాస సమస్య లక్షణాలున్న 13ఏళ్ల వయస్సు పైబడిన వారందరినీ జులై 1 నుంచి పరీక్షించడానికి సిద్ధపడింది.

సింగపూర్​లో శుక్రవారం 219కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42,955కు చేరింది. 26మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇటలీ అపార్ట్​మెంట్లలో...

ఇటలీలో కరోనా వైరస్​ సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. అయితే వైరస్​ తగ్గుముఖం పట్టడం వల్ల ఆంక్షలను ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం. కానీ దక్షిణ ఇటలీలో వైరస్ మరోమారు​ కలకలం రేపింది. అక్కడి హాట్​స్పాట్​ అపార్ట్​మెంట్​ల్లో 50కిపైగా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా 15రోజుల పాటు అపార్ట్​మెంట్లను పూర్తిగా నిర్బంధించారు అధికారులు. ఆహార పదార్థాల కోసం కూడా బయటకు రావద్దని తేల్చిచెప్పారు. సంబంధిత అధికారుల అన్ని నిబంధనలు పాటిస్తూ లోపల ఉన్న వారికి కావాల్సినవి సరఫరా చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:-'అమెరికాలో 2 కోట్ల మందికి వైరస్​!'

ABOUT THE AUTHOR

...view details