ఓవైపు ప్రపంచ దేశాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుంటే.. మరోవైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అనేక దేశాల్లో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5,710,753మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 3,52,869మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం | కేసులు | మృతులు |
అమెరికా | 17,25,808 | 1,00,625 |
బ్రెజిల్ | 394,507 | 24,593 |
రష్యా | 3,70,680 | 3,968 |
స్పెయిన్ | 2,83,339 | 27,117 |
బ్రిటన్ | 2,65,227 | 37,048 |
ఇటలీ | 2,30,555 | 32,955 |
ఫ్రాన్స్ | 1,82,722 | 28,530 |
జర్మనీ | 1,81,288 | 8,498 |
టర్కీ | 1,58,762 | 4,378 |
దక్షిణ కొరియాలో 50 రోజుల అనంతరం రికార్డు స్థాయిలో 40కేసులు వెలుగుచుశాయి. లక్షలాది మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మొదలు పట్టిన తరుణంలో కేసులు పెరగడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.