తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా తగ్గని కరోనా ఉద్ధృతి - కరోనా వైరస్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ మరణాలు 6లక్షలు దాటాయి. మొత్తం మీద 6,05,813 మంది వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,44,65,556 కేసులు వెలుగుచూశాయి. దక్షిణాఫ్రికాలో వైరస్​ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. హాంగ్​కాంగ్​లో ఇదే పరిస్థితులు నెలకొనడం వల్ల.. ఆంక్షలు మరింత కఠినం చేశారు అధికారులు.

Virus deaths top 600,000 and Hong Kong warns of resurgence
కరోనా విలయం- 6లక్షలు దాటిన వైరస్​ మరణాలు

By

Published : Jul 19, 2020, 7:56 PM IST

Updated : Jul 19, 2020, 9:58 PM IST

కరోనా సంక్షోభంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. వైరస్ ​మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 6లక్షలు దాటింది. మొత్తం మీద 6,05,813 మంది వైరస్​కు బలయ్యారు. కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 1,44,65,556 మందికి వైరస్​ సోకింది. అమెరికా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కరోనా నియంత్రణలోకి రాకపోవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానానికి చేరింది దక్షిణాఫ్రికా. మొత్తం మీద 3,50,879 కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా ఖండంలో దాదాపు సగం కేసులు ఇక్కడే బయటపడటం గమనార్హం.

దేశం కేేసులు మరణాలు
అమెరికా 38,35,430 1,42,883
బ్రెజిల్​ 20,75,247 78,817
రష్యా 7,71,546 12,342
దక్షిణాఫ్రికా 3,50,879 4,948
పెరూ 3,49,500 12,998
మెక్సికో 3,38,913 38,888
చిలీ 3,28,846 8,445
స్పెయిన్​ 3,07,335 28,420
బ్రియన్​ 2,94,006 45,273

ప్రపంచం పరిస్థితి ఇలా...

  • అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్​, ఆరిజోనా సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్​ కేసులు పెరుగుతున్నాయి. లాక్​డౌన్​ ఎత్తివేతపై అనేకమంది నిపుణులు విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ఇంకా చాలామంది మాస్కులు ధరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • హాంగ్​కాంగ్​లో వైరస్​ ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ఆసియా వాణిజ్య రాజధానిలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని హాంగ్​కాంగ్​​ నేత క్యారీ లామ్​ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆంక్షలను మరోమారు కఠినతరం చేశారు అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
  • ఐరోపాలో మునుపటితో పోల్చుకుంటే వైరస్​ తీవ్రత తక్కువగానే ఉంది. కానీ స్థానికంగా వైరస్​ వ్యాప్తి పెరుగుతోంది. ఇది అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
  • ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. దీంతో రాష్ట్రంలోని మెల్​బోర్న్​ సహా ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.

ఇదీ చూడండి:-కరోనా టీకాపై అగ్రదేశాల యుద్ధం!

Last Updated : Jul 19, 2020, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details