వాణిజ్య విమానాల స్థాయి వేగంతో నేలపైనే ప్రయాణించే రోజు రాబోతోంది. వినూత్న హైపర్‌లూప్ రావాణా వ్యవస్థను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. మనుషులను కూర్చోబెట్టి తొలిసారిగా నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న డెవ్‌లూప్ ప్రయోగ కేంద్రంలో సోమవారం ఈ పరీక్ష జరిగింది.
వర్జిన్ హైపర్‌లూప్ సంస్థ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సంస్థ అధికారులు జోష్ జీగెల్, సారా లుచియాన్లు కొత్తగా ఆవిష్కరించిన ఎక్స్పీ-2 హైపర్‌లూప్ పాడ్‌లో ప్రయాణించారు. ఆ వాహనం 15 సెకన్లలో 500 మీటర్లు దూసుకెళ్లింది. ఈ క్రమంలో గంటకు 172 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పీ-2 పాడ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
హైపర్‌లూప్ పాడ్‌ను మానవులు లేకుండా దాదాపు 400 సార్లు పరీక్షించారు. తాజాగా ప్రయోగాన్ని స్వతంత్ర భద్రతా విశ్లేషకులు పరిశీలించారు. తదుపరి కూడా మానవ సహిత ప్రయోగాలు జరుగుతాయని వర్జిన్ సంస్థ తెలిపింది. ఈసారి జరిగే ప్రయాణంలో వర్జిన్ హైపర్‌లూప్ పవర్ ఎలక్ట్రానిక్స్ నిపుణుడు తనయ్ మంజ్రేకర్ పాల్గొంటారు. ఆయన స్వస్థలం పుణె.
ఏమిటీ హైపర్‌లూప్..?