ఇప్పటివరకు నేల మీద, తాడు కట్టి గాల్లో డ్యాన్స్ వేయడం చూసుంటాం. కానీ నీటి అడుగున అద్భుతంగా స్టెప్పులతో నృత్యం చేస్తూ ఎంతో మందిని అబ్బురపరిచింది ఓ మహిళ. అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ క్రిస్టినా మకుషెంకో నీటి లోపల తన డ్యాన్స్‌తో విన్యాసాలు చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నీటి లోపల మహిళ అద్భుత నృత్య ప్రదర్శన - makishinko dance in water
ఓ అంతర్జాతీయ స్విమ్మర్ నీటిలో చేసిన డ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సాధారణంగా డ్యాన్స్ నేలపైన చేస్తారు. లేకపోతే మరికొంత సాహసించి నడుముకు తాడు కట్టి గాలిలో చేస్తారు. కానీ ఆమె నీటిలో వేసిన అబ్బురపరిచే స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రదర్శన చూడలేదంటూ కితాబిస్తు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నీటి లోపల మహిళ అద్భుత నృత్య ప్రదర్శన
ఆమె నృత్యానికి ఫిదా అయిన నెటిజన్లు ఆమె ప్రతిభను ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ స్విమ్మర్ అయిన మకుషెంకో 2011 లో యూరోపియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు కూడా సాధించింది.
ఇదీ చూడండి:టెడ్‌టాక్‌లో ఏడేళ్ల చిన్నారి.. పిల్లల పెంపకంపై స్పీచ్