తెలంగాణ

telangana

ETV Bharat / international

'లారా' ధాటికి అమెరికా గజగజ - America news

లారా తుపానుతో అమెరికాలోని పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. లూసియానా రాష్ట్రంలో నష్టం అధికంగా ఉంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

impact of powerful storm Laura
'లారా' ధాటికి అమెరికాలోని లూసియానా రాష్ట్రం గజగజ

By

Published : Aug 28, 2020, 5:24 PM IST

అమెరికాపై విరుచుకుపడిన అతి పెద్ద తుపాన్లలో ఒకటి లారా. ఈ తుపాను ధాటికి అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. దీని ప్రభావం లూసియానా రాష్ట్రంపై అధికంగా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి.

'లారా' ధాటికి అమెరికాలోని లూసియానా రాష్ట్రం గజగజ

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి.. వేలాది ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిపిచిపోయింది. గాలుల ధాటికి ఓ రైలు పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన రైలు

తుపాను ధాటికి లూసియానా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

గాలుల ధాటికి చెల్లాచెదురుగా పడిపోయిన ఇళ్ల పైకప్పులు
కూలిన ఇల్లు

ఇదీ చూడండి: వందేళ్ల ఉత్సవం.. శ్వేతసౌధం ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details