తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ ఓట్లు లెక్కిస్తే విజయం మాదే: ట్రంప్ - us elections 2020 trump

తనను రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా పెద్ద కుట్రే జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. మీడియా, ఎన్నికల అధికారులు డెమొక్రాట్లతో కుమ్మక్కయ్యారన్నారు. లీగల్ ఓట్లు లెక్కిస్తే విజయం తమదేనని ప్రకటించారు.

trump
ట్రంప్

By

Published : Nov 6, 2020, 1:40 PM IST

లీగల్‌ ఓట్లు లెక్కిస్తే విజయం తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే తనదే విజయం అని బుధవారం ప్రకటించుకున్న తర్వాత తొలిసారి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌ పద్ధతి, ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తనని రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా పెద్ద కుట్రే జరుగుతోందని ఆరోపించారు. మీడియా, ఎన్నికల అధికారులు డెమొక్రాట్లతో కుమ్మక్కయ్యారన్నారు.

"మీరు లీగల్‌ ఓట్లు లెక్కిస్తే నేను సులభంగా విజయం సాధిస్తా. పెద్ద పెద్ద సాంకేతిక, మీడియా సంస్థలు జోక్యం చేసుకున్నప్పటికీ.. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో నేనే విజయం సాధించాను. డెమొక్రాట్ల హవా నడుస్తోందన్నారు. కానీ, ఎక్కడా అది కనిపించలేదు. మొత్తం మా రిపబ్లికన్ల గాలే వీచింది. సెనేట్‌లో పట్టు నిలుపుకున్నాం. ఈ సారి ఎక్కవ మంది రిపబ్లికన్‌ మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అవినీతి ప్రక్రియ..

"మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ పద్ధతి అవినీతితో కూడుకున్న ప్రక్రియ. వారు గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలో చూసుకొని మరీ వారు ఓటేస్తున్నారు. దీనికి మెయిల్‌-ఇన్‌ విధానం సహకరిస్తోంది. అకస్మాత్తుగా బ్యాలెట్లు వచ్చి పడుతున్నాయి. రిపబ్లికన్ల ఎన్నికల పరిశీలకులు లేకుండానే కౌంటింగ్‌ జరుపుతున్నారు. అసలు కౌంటింగ్‌ టేబుళ్లపై ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు రిపబ్లికన్లను అనుమతించడం లేదు" అంటూ ఎన్నికల వ్యవస్థ, కౌంటింగ్‌ ప్రక్రియపై ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు.

ప్రసంగం నిలిపివేత..

దాదాపు 17 నిమిషాల పాటు ప్రసంగించిన ట్రంప్‌ విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు స్వీకరించలేదు. మరోవైపు మెజారిటీ మీడియా సంస్థలు ట్రంప్‌ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశాయి. అధ్యక్షుడు తన ప్రసంగంలోనే అవాస్తవాలు వల్లెవేస్తున్నారని.. ఎన్నికల విధానంపై అసంబద్ధమైన ఆరోపణలు గుప్పిస్తున్నారని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:ట్రంప్​కు సొంత పార్టీ నేతల నుంచే మద్దతు కరవు

ABOUT THE AUTHOR

...view details