కొవిడ్-19 సోకిన తల్లుల నుంచి నవజాత శిశువులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా స్వల్పమేనని ఓ సర్వేలో తేలింది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే.. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకుతున్నట్లు స్పష్టమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శిశువుకు తల్లులు పాలు కూడా పట్టించవచ్చని సర్వే పేర్కొంది.
కరోనా బారిన పడిన తల్లి నుంచి బిడ్డను వేరుగా ఉంచాల్సిన అవసరం కూడా ఏమీ ఉండబోదని సర్వే స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా సోకిన తల్లులకు పుట్టిన 101 మంది శిశువులపై.. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ అధ్యయనకర్తలు పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన సారాంశం 'జామా పీడియాట్రిక్స్' జర్నల్లో ప్రచురితమైంది.