తెలంగాణ

telangana

ETV Bharat / international

రణరంగాన్ని తలపిస్తున్న వెనెజువెలా

అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వెనెజువెలా ప్రతిపక్ష నేత జాన్ గుయాడో.. రాజధాని కరాకస్​లో ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురో నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించేందుకు అగ్రరాజ్యం సహకరించాలని డిమాండ్ చేశారు.

''అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యం''

By

Published : May 1, 2019, 10:03 AM IST

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో సంక్షోభం మరింత ముదిరింది. అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా రాజధాని నగరం కరాకస్​లో ప్రతిపక్షనేత జాన్ గుయాడో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గుయాడోకు మద్దతుగా పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మదురో పాలనను అంతమొందించేందుకు సైన్యం సహకారమందించాలని, అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలకు గుయాడో పిలుపు..

అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతిపక్షనేత జాన్ గుయాడో. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనకారులతో తిరుగుబాటుకు సహకరించాలని సైన్యాన్ని అభ్యర్థించారు. అయితే కేవలం ఓ అధికారి, కొంతమంది సైనికులు మాత్రమే గుయాడో తరఫున చేరారు.
గుయాడోను వెనెజువెలా అధ్యక్షుడిగా 50 దేశాలు గుర్తించాయి.

వీధి పోరాటాలు...

ఇరు నేతలకు మద్దతిచ్చే వారి మధ్య వీధి పోరాటాలూ జరుగుతున్నాయి. మదురోను జయించేందుకు చివరి అవకాశంగా ఆందోళనకారులు భావిస్తున్నారు. ప్రతిపక్షనేత జాన్​ గుయాడో, ప్రధాన ఉద్యమకారుడు 'లిపోల్డో లోపెజ్'​లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనల్లో మొత్తం 68 మందికి గాయాలయ్యాయి.

ఉద్యమకారుడు లిపోల్డో లోపెజ్​ను నిఘా అధినేత క్రిష్టఫర్ ఫిగుయెరా అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మరో ప్రాంతంలో ప్రభుత్వ మద్దతుదారులు గుమిగూడారు.

అనైతికంగా అధికారంలోకి

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. రాజ్యాంగ నియమాల్ని లక్ష్యపెట్టకుండా మదురో రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షనేత గుయాడో. ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలను చేపట్టడం అనైతికమని పలు దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రష్యా జోక్యం చేసుకోవాలి: అమెరికా

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో హింసాత్మక చర్యలకు దిగకుండా రష్యా జోక్యం చేసుకోవాలని అమెరికా ఓ ప్రకటన చేసింది. మదురో రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తున్న కారణంగా చొరవ చూపాలని పేర్కొంది. అమాయకులపై వెనెజువెలా సైన్యం దాడులకు దిగుతోందని ఆరోపించింది.

అయితే ప్రతిపక్షనేత గుయాడోనే అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని రష్యా ఆరోపించింది.

''అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యం''

ఇదీ చూడండి: పెళ్లి కంటే 'పబ్​జీ' యే ముఖ్యం.. !

ABOUT THE AUTHOR

...view details