తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఆంక్షలతో వెనెజువెలాపై ఒత్తిడి - వెనెజువెలా

నేటి నుంచి వెనెజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీలు వెనెజువెలాతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని అగ్రరాజ్యం స్పష్టంచేసింది. ఆజ్ఞ మీరితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

వెనెజువెలాపై అమెరికా ఆంక్షలు...

By

Published : Apr 28, 2019, 7:48 PM IST

వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం అమెరికా. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మడూరోను అణచివేసేందుకే ఈ చర్య. ఆదివారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. తద్వారా ప్రతిపక్షనేత జువాన్ గువైడోను అధికారంలోతి తేవాలన్నదే సర్కారు యోచన. ఇప్పటికే 50 దేశాలు గువాయిడో నాయకత్వాన్ని గుర్తించాయి.

వెనెజువెలాతో వ్యాపార ఒప్పందాలు చేసే ఏ సంస్థపైనైనా చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలా అధికారిక చమురు సంస్థతోపాటు.. వెనెజ్ ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉన్న ఏ కంపెనీతో సంబంధాలు నెరపకూడదని సూచించింది.

మడూరోతో చర్చలు జరపడం తమకెంత మాత్రం అంగీకారం కాదని అమెరికా ప్రకటించింది. వెనెజువెలా విదేశాంగ శాఖమంత్రి జార్జి అరియెజాకు చెందిన అమెరికా ఆస్తుల్నీ జప్తు చేస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. సంక్షోభంలో కూరుకుపోయిన వెనెజువెలాను గత మూడు నెలలుగా అధ్యక్షుడు మడూరో నెట్టుకొస్తున్నారు. ఈయన వామపక్ష పార్టీకి చెందినవారు.

సంక్షోభం తలెత్తక ముందు వెనెజువెలా రోజుకు 50వేల బ్యారెళ్ల చమురును ప్రభుత్వ కంపెనీ సిట్గో రిఫైనరీ ద్వారా అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేది. సిట్​గోను అదుపులోకి తీసుకున్న అమెరికా ప్రస్తుతం ప్రతిపక్షనేత గువాయిడోకు అప్పగించింది.

ఇదీ చూడండి: 'మోదీ జనాన్ని తెలివితక్కువోళ్లు అనుకుంటున్నారా?'

ABOUT THE AUTHOR

...view details