తెలంగాణ

telangana

ETV Bharat / international

వెనుజువెలాలో అవాంఛిత గర్భాలు- కారణం ఇదే! - అక్రమ సంబంధాలు

వెనెజువెలాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు దేశంలోని మహిళలకు అవాంఛిత గర్భం మరో పెద్ద సమస్యగా మారింది. గర్భ నిరోధక మందులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సర్వేలు పేర్కొంటున్నాయి.

మందుల కొరతతో పెరుగుతున్న అవాంఛిత గర్భాలు

By

Published : Aug 22, 2019, 8:57 AM IST

Updated : Sep 27, 2019, 8:37 PM IST

వెనుజువెలాలో అవాంఛిత గర్భాలు- కారణం ఇదే!

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వెనెజువెలాను మరో సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. అధిక సంఖ్యలో మైనర్లు గర్భం దాల్చుతున్నారు. గర్భనిరోధక మందులు అందుబాటులో లేకపోవడం, అక్రమ సంబంధాలు మొదలైనవి అవాంఛిత గర్భానికి కారణాలవుతున్నాయని పలు స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి.
151 ఫార్మసీలను సంప్రదించి స్వతంత్ర సర్వే చేపట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. గర్భనిరోధక మందులు, హార్మోన్​ ప్యాచ్​ వంటివి అందుబాటులో లేవని నివేదించింది. కండోమ్​లు అందుబాటులో ఉన్నా, వాటి ధర ఎక్కువగా ఉండటం వల్ల వాటిని వినియోగించే వీలు లేదని తెలిపింది.

వెనుజువెలాలో 20 ఏళ్లలోపే గర్భం దాల్చిన వారు 23 శాతం. సంఖ్యా పరంగా చూస్తే 90 లక్షలు. కారెలీస్​ హెర్రెరా అనే బాలిక గర్భం దాల్చినప్పుడు ఆమె వయసు 14 ఏళ్లు. ప్రస్తుతం హెర్రెరాకు 15 ఏళ్లు. హెర్రెరా తన స్నేహితుడు, తండ్రి సాయంతో కాలం నెట్టుకొస్తున్నారు.

"నేను గర్భవతిని అని తెలిసినప్పుడు చనిపోవాలనుకున్నా. కానీ ఇప్పుడు నాకు చిన్నవయసులోనే పాప ఉంది. కాబట్టి అది చెయ్యలేక పోయాను. నా భాగస్వామి నన్ను పూర్తిగా వదిలేసి వెళ్లిపోయాడు."

-కారెలీస్ హెర్రెరా

ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి జనాభా నిధి నుంచి ఇప్పటివరకు 45వేల హార్మోన్ల ఇంప్లాంట్లను దిగుమతి చేసుకుంది వెనుజువెలా ప్రభుత్వం.

దేశంలోని అతిపెద్ద పీడియాట్రిక్​ ఆసుపత్రిలో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు డాక్టర్​ క్లెమెంటే. గర్భనిరోధక మందులను ఉపయోగించకపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆమెకు తెలుసు. ఐరాస​ అందించిన గర్భ నిరోధక ఇంప్లాంట్ సాయంతో గర్భాన్ని నిరోధించడానికి గత నాలుగేళ్లుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వెనెజులా రాజధాని శివార్లలోని షాంటి పట్టణంలో క్లెమెంటే బృందం వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి:కొరియాతో 'అణు' చర్చలు కొనసాగిస్తాం: అమెరికా

Last Updated : Sep 27, 2019, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details