అధికారులు, ఖైదీల మధ్య ఘర్షణ వెనెజువెలాలో 23మంది ప్రాణాలు పోయేందుకు కారణమయింది. పోర్చుగీసా రాష్ట్రం లోని ఓ జైలులో బ్యారక్‌లోకి అధికారులను ఖైదీలు అనుమతించకపోవడం ఈ ఘటనకు దారితీసింది. తమ వద్ద ఉన్న ఆయుధాలు, అనుమతి లేని వస్తువులను స్వాధీనం చేసుకుంటారన్న అనుమానంతో అధికారులను నిలువరించేందుకు ఖైదీలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా, 18మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
జట్లుగా విడిపోయిన ఖైదీలు జైళ్లలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలను సరఫరా చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.
"ఘటనకు కారణం బ్యారక్‌లను అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చిన ఖైదీలదే"