తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్ష వీధిలో వేసవి సెలవులు గడపొచ్చు!

సెలవులొస్తే... పక్క రాష్ట్రానికే, దేశానికో వెళ్లి వస్తుంటాం. సరదాగా అంతరిక్షంలోకి వెళ్లి రాలేమా? ఔననే అంటోంది అమెరికాకు చెందిన వర్జిన్​ గెలాక్టిక్​ సంస్థ. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తోంది. అవి రాకపోకలు ప్రారంభించేందుకు అవసరమైన అంతరిక్ష నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసింది.

By

Published : May 11, 2019, 3:14 PM IST

న్యూమెక్సికో అంతరిక్ష నౌకాశ్రయం

అంతరిక్షంలోకి ఎయిర్​బస్​

అంతరిక్ష పర్యటకంలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ తయారు చేస్తున్న అంతరిక్ష నౌక ల్యాండింగ్, లాంచింగ్​ కోసం అమెరికా న్యూమెక్సికోలోని ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. త్వరలో ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించి, రోదసిలో సరదాగా విహరించాలన్న కలను సాకారం చేయాలని భావిస్తోంది వర్జిన్ గెలాక్టిక్​ సంస్థ. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారి రిచర్డ్​ బ్రాన్సన్​ ఈ సంస్థ వ్యవస్థాపకుడు.

"అమెరికాలో వర్జిన్​ గెలాక్టిక్ కోసం అంతరిక్ష నౌకాశ్రయం సాధ్యమైంది. న్యూ మెక్సికో అందుకు వేదికైంది. పెట్టుబడులూ రాబోతున్నాయి. విద్య, సాంకేతిక పురోగతితో మరిన్ని సాధ్యమవుతాయి."

-రిచర్డ్​ బ్రాన్సన్​, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష పర్యటన కోసం గతంలో ఓ వాహకనౌకను నిర్మించింది. 2014లో పరీక్షిస్తుండగా ఆ రాకెట్​ రెండు ముక్కలైంది. పైలట్​ మరణించాడు. ఆ వాహకనౌకలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది... అంతరిక్ష విహారానికి వాహనాన్ని సిద్ధం చేస్తోంది ఆ సంస్థ.

ఇదీ చూడండి: అట్టహాసంగా రష్యా 74వ 'విక్టరీ డే' వేడుకలు

ABOUT THE AUTHOR

...view details