అమెరికా కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. సుసాన్విల్ సమీపంలోని రెనో ప్రాంతంలో మంగళవారం 10 అంగుళాల మేర మంచు కురిసింది. మైర్స్ ప్రాంతంలో 9.5 అంగుళాల హిమపాతం నమోదైంది.
అసలే కరోనా భయం... ఆపై మంచు తుపాను బీభత్సం - హిమపాతం
కరోనా వైరస్ వ్యాప్తితో హడలిపోతున్న అమెరికా వాసుల్ని మంచు తుపాను మరింత వణికిస్తోంది. కాలిఫోర్నియాలో తీవ్రమైన హిమపాతం కారణంగా అనేక చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది.
![అసలే కరోనా భయం... ఆపై మంచు తుపాను బీభత్సం various, heavy snowfall covers trees, mountains, roads in reno, nevada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6451199-879-6451199-1584518288054.jpg)
అసలే కరోనా భయం... ఆపై మంచు తుపాను బీభత్సం
మంచు తుపాను ధాటికి రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మంగళవారం ఒక్కరోజే రెనో-స్పార్క్స్ ప్రాంతంలో 10కిపైగా వాహన ప్రమాదాలు జరిగాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
అసలే కరోనా భయం... ఆపై మంచు తుపాను బీభత్సం