తెలంగాణ

telangana

ETV Bharat / international

వాషింగ్టన్​లో మహాత్ముని విగ్రహం పునరుద్ధరణ - us latest news

అమెరికాలోని వాషింగ్టన్​లో భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ తిరిగి ప్రారంభించారు. జార్జి ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో గాంధీ విగ్రహాన్ని గత నెలలో ధ్వంసం చేశారు ఆందోళనకారులు.

Vandalised Mahatma Gandhi statue in Washington DC restored
వాషింగ్టన్​లో మహాత్ముని విగ్రహం పునరుద్ధరణ

By

Published : Jul 3, 2020, 4:51 AM IST

అమెరికా వాషింగ్టన్​లో ఆందోళన కారులు ధ్వసం చేసిన భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్దరించారు. భారత రాయబారి తరంజిత్ సింగ్ గురువారం ఉదయం గాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు. మహాత్మునికి నివాళులు అర్పించారు. గాంధీ ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సామరస్యం సందేశాలు ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

జూన్ 3న

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతికి నిరనసగా అమెరికాలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు ప్రజలు. జూన్ 3న వాషింగ్టన్​లోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్​కు అమెరికా క్షమాపణలు చెప్పింది.

ఇదీ చూడండి: వాషింగ్టన్​లో మహాత్ముని విగ్రహం ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details