తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​ గట్టెక్కాలంటే.. టీకాలే దిక్కు' - ఆంటోనీ ఫౌచీ ఇండియా లాక్​డౌన్

భారత్​లో కరోనా విలయాన్ని అడ్డుకోవాలంటే ప్రజలందరికీ టీకాలు వేయాలని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఇదే దీర్ఘకాలిక పరిష్కారమమని అన్నారు. వైరస్ వ్యాప్తి గొలుసుకట్టును ఛేదించాలంటే దేశంలో లాక్​డౌన్ విధించాలని పునరుద్ఘాటించారు.

fauci india lockdown
ఫౌచీ ఇండియా లాక్​డౌన్

By

Published : May 10, 2021, 8:13 AM IST

భారత్‌లో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రజలందరికీ టీకాలు వేయడమే ఏకైక దీర్ఘకాలిక పరిష్కారమని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. భారత్‌... మహమ్మారిని ఓడించడానికి స్వదేశీ వనరులతో పాటు ప్రపంచ వనరులనూ వినియోగించుకుని వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పదుల కోట్ల డోసులను తయారు చేయగల సామర్థ్యమున్న సంస్థలను రంగంలోకి దించాలని భారత్‌కు సూచించారు.

చైనా గతేడాది చేసినట్లుగానే భారత్‌ కూడా త్వరితగతిన తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని ఫౌచీ పేర్కొన్నారు. అప్పుడే ప్రస్తుతమున్న పడకల కొరతను అధిగమించొచ్చన్నారు. భారత్‌లో కరోనా బాధితులకు ఎదురవుతున్న ఆక్సిజన్‌ కొరతపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి గొలుసుకట్టును ఛేదించాలంటే లాక్‌డౌన్‌ విధించాల్సిందేనని పునరుద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details