అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలపై ప్రయాణ ఆంక్షలను (US travel restrictions) ఎత్తివేయనుంది. నవంబర్ నెల ప్రారంభం నుంచి ఐరోపా సమాఖ్య దేశాలు, బ్రిటన్,భారత్, చైనా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ తదితర దేశాల ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్వేతసౌధం అధికార వర్గాలు వెల్లడించాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుంచి ప్రయాణాలపై ఆంక్షలు (US travel restrictions) విధించింది అమెరికా. అప్పటి ట్రంప్ సర్కారు.. వైరస్ కట్టడికి తొలిసారి అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ఈ ఆంక్షలను కొనసాగించారు. అంతేగాక ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ సహా అనేక దేశాలపై కొత్త ఆంక్షలు విధించారు.