తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పులు- ముగ్గురు మృతి - చికాగో పోలీసు సూపరింటెండెంట్

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధుడైన దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు అమాయకులు బలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికాగోలో జరిగిందీ ఘటన.

US-LD SHOOTING
అమెరికాలో కాల్పులు ముగ్గురు మృతి

By

Published : Jan 10, 2021, 11:05 PM IST

అమెరికాలో కాల్పుల మోత మోగింది. గన్​తో వచ్చిన దుండగుడు చికాగోలో ముగ్గురిని కాల్చి చంపాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 15 ఏళ్ల బాలిక చికిత్స పొందుతోంది. భద్రతాధికారులపైనా కాల్పులు జరపగా.. ఎవరికీ గాయాలు కాలేదు. చివరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. మృతుల పేర్లను పోలీసులు విడుదల చేయలేదు.

పెరిగిపోతున్న గన్​ కల్చర్​..

చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన నైటెంగేల్ అనే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల వెనుక ఉద్దేశం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అమెరికాలో పెరిగిపోతున్న గన్​ కల్చర్​పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి:మంచు గడ్డలతో యువకుల ఫైటింగ్​

ABOUT THE AUTHOR

...view details