అమెరికాలోని చికాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఓ మైనర్ ఉన్నట్లు పేర్కొన్నారు.
"దక్షిణ చికాగోలో రాత్రి 9:40 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. నగరంలోని వెస్ట్ పుల్‌మాన్ పరిసరాల్లో పాదచారుల బృందంపై వాహనాల్లో వచ్చిన కొందరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, టీనేజ్ బాలికతో సహా ఐదుగురు గాయపడ్డారు."
-పోలీసు వర్గాలు
పాదచారులపై పలు రౌండ్ల కాల్పులు జరిపిన నిందితులు.. బాధితులను తీవ్రంగా కొట్టారని పోలీసులు వివరించారు. తీవ్రంగా గాయపడిన 42 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమె ఎవరనేది గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ముఖంపై గాయాలైన 32 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా, ఇతర బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు.
కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని.. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి: