కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. భారత్కు అండగా నిలుస్తామని అమెరికా తెలిపింది. భారత్లో కొవిడ్ ఉద్ధృతికి చలించిపోయామన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వైద్య అవసరాలకు మద్దతు ఇస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"భారత్లో కరోనా ఉద్ధృతిని చూసి మా హృదయాలు చలించిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ ప్రజలకు, కరోనా యోధులకు అండగా ఉంటాం. ఇందుకు కావాల్సిన వైద్య అవసరాలకు మద్దతు ఇస్తాం."
- ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి