తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానంలో కొవిడ్​ పరీక్ష.. పాజిటివ్​ అని తేలి చివరికి బాత్​రూంలో.. - కొవిడ్​ అమెరికా

woman tested positive for covid on flight: ఆరు గంటల విమాన ప్రయాణం. జర్నీ మొదలైన కొద్దిసేపటికి శరీరంలో ఏదో బాధ. కొద్దిసేపటికే తీవ్రమైన గొంతునొప్పి. కొవిడ్​ పరీక్ష చేయించుకుంటే.. పాజిటివ్​ రిపోర్టు.. 150మంది ప్రయాణిస్తున్న విమానంలో ఓ మహిళకు ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

woman tested positive for covid on flight
విమానంలో కొవిడ్​ పరీక్ష.. పాజిటివ్​ అని తేలి చివరికి..

By

Published : Dec 31, 2021, 11:06 AM IST

Covid test on flight US: డిసెంబర్​ 20.. ఓ విమానం చికాగో నుంచి ఐస్​లాండ్​కు బయలుదేరింది. విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గం మధ్యలో మారిసా ఫోటీయో అనే స్కూల్​ టీచర్​కు గొంతు నొప్పి మొదలైంది. దీంతో ప్రయాణంలోనే ఆమెకు కొవిడ్​ పరీక్షను సిబ్బంది నిర్వహించారు. ఆ పరీక్షలో.. మారిసాకు కొవిడ్​ పాజిటివ్​ అని తేలింది.

ఆ విమాన ప్రయాణం మొత్తం సమయం ఆరు గంటలు. ప్రయాణం మొదలైన గంటలోపే.. మారిసాకు పాజిటివ్​ అని తేలింది. దీంతో మారిసా.. తన సీటును వదిలేసి బాత్​రూంకు వెళ్లిపోయింది. స్వీయ నిర్బంధం కోసం దాదాపు ఐదు గంటల పాటు ఆమె బాత్​రూంలోనే ఉండిపోయింది. తన పరిస్థితిని వివరిస్తూ.. టిక్​టాక్​ వీడియో రూపొందించింది.

"విమానంలో 150మంది ఉన్నారు. నాకు పాజిటివ్​ అని తేలడం కన్నా.. నా నుంచి వారికి కొవిడ్​ సోకుతుందేమో అన్న భయం ఎక్కువగా ఉండేది. అందుకే బాత్​రూంకు వెళ్లిపోయాను. అయితే విమాన సిబ్బంది నన్ను బాగా చూసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. నాకు 'వీఐపీ క్వారంటైన్​' ఏర్పాట్లు చేశారు. ఆహారం, డ్రింక్స్​ అన్ని అందించారు. నా ఆరోగ్యం ఎలా ఉందని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు," అని మారిసా వివరించింది.

Iceland covid rules: సాధారణంగా.. ఐస్​లాండ్​లో ప్రయాణించాలంటే.. 72గంటల ముందు కొవిడ్​ పరీక్షకు సంబంధించిన రిపోర్టు ఉండాల్సిందే. మరి విమానం ఎక్కే ముందు.. మారిసా ఎప్పుడు పరీక్ష చేయించుకున్నారు? అన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. విమానం దిగిన వెంటనే ఆమె ఓ హోటల్​లో క్వారంటైన్​లోకి వెళ్లింది. తాజాగా.. ఆమెకు శుక్రవారం కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:-3 నెలలు ఎయిర్​పోర్ట్​లోనే నివాసం.. నిర్దోషిగా బయటకు...

ABOUT THE AUTHOR

...view details