పుట్టినరోజునాడు ప్రతి ఒక్కరూ తమ కోరికల జాబితాలోని ఏదో ఒకదానిని నేరవేర్చుకుంటుంటారు. కొందరు విదేశాలకు వెళ్తే.. మరికొందరు తమకు ఇష్టమైన గుడికో, లేక నచ్చిన ప్రాంతానికో వెళ్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఆలోచించింది అమెరికా- రోక్స్బోరోకు చెందిన వందేళ్ల బ్రయాంట్ అనే వృద్ధురాలు. కారాగారంలో ఖైదీగా ఉండాలన్న తన కలను 100వ పుట్టినరోజు సందర్భంగా నెరవేర్చుకుంది ఈ బామ్మ. పర్సన్ కౌంటీ అధికారుల సాయంతో బ్రయాంట్ కల నెరవేరింది.
చేతులకు బేడీలతో...
బ్రయంట్ కోరిక ప్రకారం.. ఆమెను ఇంటి నుంచి చేతులకు బేడీలు వేసి ఖైదీలను తీసుకెళ్లినట్లుగానే కార్లో ఎక్కించి తీసుకెళ్లారు ఇద్దరు అధికారులు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లేటప్పుడు రహదారి వెంట సైరన్‌ను కూడా మోగించారు.