తెలంగాణ

telangana

ETV Bharat / international

'హక్కుల ఉల్లంఘనపై చైనాను నిలదీయడం ఖాయం' - చైనా మానవహక్కుల ఉల్లంఘన

షిన్​జియాంగ్ ప్రాంతంలోని ఉయ్​ఘర్​ ముస్లింలపై హత్యాకాండ వ్యవహారంలో చైనాను అమెరికా తప్పకుండా ప్రశ్నిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. మార్చి 18న అమెరికా-చైనా ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

US will speak out forcefully against China committing 'genocide'
'హక్కుల ఉల్లంఘనపై చైనాను తప్పకుండా ప్రశ్నిస్తాం'

By

Published : Mar 11, 2021, 6:14 PM IST

మానవహక్కుల ఉల్లంఘన, షిన్​జియాంగ్​ ప్రాంతంలోని ఉయ్​ఘర్​ ముస్లింలపై మారణహోమానికి సంబంధించి చైనా తీరును తప్పుబట్టారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. ఈ అంశానికి సంబంధించి చైనాను తప్పక ప్రశ్నిస్తామని అన్నారు.

ఇప్పటికే చాలా మంది అమెరికా ప్రజాప్రతినిధులు చైనా తీరును దుయ్యబట్టారు. అయితే.. బైడెన్​ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా-చైనా ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో బ్లింకెన్​ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్... మార్చి 18న అలాస్కా వేదికగా చైనా విదేశాంగ మంత్రి యాంగ్​ జైచీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

అయితే.. ఇది అంతర్గత విషయని, ఇలాంటి విషయాల్లో అమెరికా జోక్యం సరికాదని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. చైనా సార్వభౌమాధికారం, భద్రత విషయాలను గౌరవించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'టిబెట్​లో చైనా జోక్యం తగదు.. ఆ దేశంలో స్వేచ్ఛ ఉండాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details