తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాపై ఆ 2 మహమ్మారులు కలిసి దాడి చేస్తే.. - కోవిడ్- 19 వార్తలు

శీతకాలంలో కరోనా వైరస్​కు జతగా ఫ్లూ వ్యాప్తితో అమెరికాకు భారీ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు మహమ్మారులు కలిసి అగ్రరాజ్య వైద్య వ్యవస్థకు అతిపెద్ద సమస్యగా మారనున్నట్లు తెలిపారు.

VIRUS-US
అమెరికా

By

Published : Apr 22, 2020, 11:20 AM IST

కరోనా మహమ్మారితో ఇప్పటికే అతలాకుతలం అవుతోన్న అమెరికాకు మరింత ప్రమాదం పొంచి ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది చివరలో రెండో దశ వైరస్ ప్రభావం ప్రస్తుతం సంక్షోభానికన్నా తీవ్రంగా ఉంటుందని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్ రాబర్ట్ రెడ్​ఫీల్డ్ హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో శీతకాలం ఫ్లూ బెడద అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనాకు జతగా ఫ్లూ మహమ్మారి కలిసి అమెరికాపై విరుచుకుపడుతుందని తెలిపారు. ఒకవేళ ఫ్లూ మహమ్మారి, కరోనా వైరస్​ మొదటి దశ ఒకే సమయంలో వ్యాప్తి చెందినట్లయితే పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండేదని అన్నారు.

రెండో దశలో..

వైద్య వ్యవస్థ సామర్థ్యం పరంగా చూస్తే చాలా సమస్యలు ఎదురవుతాయని ఆయన అంచనా వేశారు. కానీ అదృష్టవశాత్తూ ఆ సమయంలో కరోనా రాలేదని అన్నారు. అయినప్పటికీ కరోనా రెండో దశలో ఈ ప్రమాదం ఉందని అంటున్నారు.

"ఫ్లూ మహమ్మారి, కరోనా వైరస్​ను మనం ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు తెచ్చే రెండు వ్యాధులను ఒకేసారి రావటం వైద్య వ్యవస్థపై ఊహించని విధంగా భారం పడుతుంది."

- రాబర్ట్ రెడ్​ఫీల్డ్

ఒకే తీరు లక్షణాలతో..

శీతకాలంలో రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందితే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుందన్నారు శ్వేతసౌధ కరోనా వైరస్ టాస్క్​ఫోర్స్ సభ్యుడు డాక్టర్ డెబోరా బ్రిక్స్. రెండు వ్యాధులు ఒకేసారి విజృంభిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

"ఫ్లూ, కరోనా సోకిన వ్యక్తులు లక్షణాల పరంగా దాదాపు ఒకేలా ఉంటారు. ఈ నేపథ్యంలో ఫ్లూ తో పాటు కరోనా నిర్ధరణ పరీక్షలు చేసే విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేక అల్గారిథం రూపొందిస్తున్నాం. అందుకు తగినట్లు టెస్టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నాం. "

- డాక్టర్ డెబోరా బ్రిక్స్

ప్యాకేజీకి ఆమోదం లాంఛనమే!

అమెరికా సెనేట్​ ఆమోదించిన 48.3 వేల కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీపై ప్రతినిధుల సభలో గురువారం ఓటింగ్​ జరగనుంది. చిన్న వ్యాపారాలు, ఆసుపత్రులు, నిర్ధరణ పరీక్షలకు తోడ్పాటును ఇచ్చే ఈ ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రకటించిన ఈ నాల్గవ ప్యాకేజీలో 33.1 వేల కోట్ల డాలర్లు చిన్న వ్యాపారాల రుణ అవసరాలను తీర్చేందుకు కేటాయించారు. ఆసుపత్రులకు 7,500 కోట్ల డాలర్లు, పరీక్షల సామర్థ్యం పెంచేందుకు 2,500 కోట్ల డాలర్లు అందివ్వనున్నారు.

ఇదీ చూడండి:60 రోజుల పాటు గ్రీన్​కార్డుల మంజూరు నిలిపేసిన అమెరికా

ABOUT THE AUTHOR

...view details