తెలంగాణ

telangana

ETV Bharat / international

కర్తార్​పుర్​ నడవా వేడుకను స్వాగతించిన అమెరికా

కర్తార్​పూర్​ నడవా ప్రారంభోత్సవంపై అగ్రరాజ్యం స్పందించింది. పరస్పర ప్రయోజనాల కోసం పొరుగు దేశాలు కలిసి ముందుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది.

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవంపై అమెరికా స్పందన

By

Published : Nov 10, 2019, 5:30 AM IST

కర్తార్​పుర్​ నడవా ప్రారంభించడాన్ని అమెరికా స్వాగతించింది. పరస్పర ప్రయోజనాల కోసం భారత్​-పాకిస్థాన్​ దేశాలు కలిసి పనిచేయడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది.

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ చరిత్రాత్మక కర్తార్​పుర్ ​నడవాను శనివారం అధికారికంగా ప్రారంభించారు. భారతీయ సిక్కు భక్తులకు వీసాలేకుండానే దర్శనానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్​లో కర్తార్​పూర్​ నడవా ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

సిక్కు మత స్థాపకులు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరుస్తూ కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం తెరుచుకుంది. తొలి బ్యాచ్‌ ప్రయాణీకులకు పాక్ ప్రధాని స్వాగతం పలికారు.

ఈ ఏడాదిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి, ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా సూచించింది. భారత్​-పాక్​ కోరితే మధ్యవర్తిత్వం వహించి కశ్మీర్​ సమస్యను పరిష్కరిస్తానని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అనేక మార్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'పారిస్'​ నుంచి వైదొలిగేందుకు అమెరికా ప్రక్రియ​ షురూ!

ABOUT THE AUTHOR

...view details