తెలంగాణ

telangana

ETV Bharat / international

అణ్వాయుధ స్థావరాలు విస్తరిస్తున్న చైనా! - చైనా

చైనా తన న్యూక్లియర్​ మిసైల్​ స్థావరాలను విస్తరిస్తోందని అమెరికా పరిశోధకులు తెలిపారు. షింజియాంగ్​ ప్రాంతంలో సుమారు 250కిపైగా భూగర్భ అణ్వాయుధ స్థావరాలు నిర్మాణంలో ఉన్నట్లు ఉపగ్రహ​ చిత్రాల ద్వారా గుర్తించినట్లు చెప్పారు.

US warns China is building more nuclear missile silos
చైనా అణ్వాయుధ స్థావరాల విస్తరణ

By

Published : Jul 30, 2021, 5:06 PM IST

న్యూక్లియర్​ మిసైల్​ స్థావరాలను చైనా విస్తరిస్తూ పెను ముప్పుగా మారుతోందని హెచ్చరించింది అమెరికా. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అణు క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా భూగర్భ స్థావరాలను నిర్మించటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా అణ్వాయుధ స్థావరాల నిర్మాణాల సాటిలైట్​ చిత్రాలు

పశ్చిమ చైనాలో కొత్త స్థావరాలను ఉపగ్రహం​ ద్వారా గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్యకు చెందిన పరిశోధకులు తెలిపారు. సుమారు 250 భూగర్భ మిసైల్​ స్థావరాలు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా వేశారు. ఈ అంశంపై వచ్చిన న్యూయార్క్​ టైమ్స్​ కథనాన్ని ట్వీట్​ చేసింది అమెరికా స్ట్రాటజిక్​ కమాండ్​. ప్రపంచానికి ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

మూడు ప్రాంతాల్లో నిర్మాణాలు

చైనాలోని షింజియాంగ్​ ప్రాంతంలో ఈ ఏడాది వేసవిలోనే రెండో స్థావరాన్ని గుర్తించారు పరిశోధకులు. గాన్సూ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మరో స్థావరాన్ని జూన్​లో గుర్తించినట్లు కాలిఫోర్నియాలోని జేమ్స్​ మార్టిన్​ సెంటర్​ ఫర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ స్టడీస్​ పరిశోధకులు తెలిపారు. ఈ రెండు స్థావరాలు సుమారు 800 చదరపు కిలోమీటర్ల మేర ఉంటాయని చెప్పారు. భూగర్భ స్థావరాల్లో ఖండాంతర బాలిస్టిక్​ క్షిపణులను మోహరించేందుకు వీలుంటుంది.

అణ్వాయుధ స్థావరాలు

నో కామెంట్​..

న్యూక్లియర్​ మిసైల్​ స్థావరాల విస్తరణ వార్తలపై గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు చైనా. తాజాగా వచ్చిన వార్తలపై విలేకరులు ప్రశ్నించగా.. అక్కడి పరిస్థితులపై తమకు ఎలాంటి విషయాలు తెలియదని విదేశాంగ శాఖ పేర్కొనటం గమనార్హం.

సాటిలైట్​ చిత్రాలు

గత దశాబ్ద కాలంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో చైనా అణ్వాయుధాలను సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. దక్షిణ చైనా సముద్రం, తైవాన్​ విషయంలో అమెరికా సైనిక ఘర్షణకు దిగే అవకాశం ఉందనే అంచనాలతోనే చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని నిపుణులు పేర్కొంటున్నారు.

చైనా అణ్వాయుధ స్థావరాల సాటిలైట్​ చిత్రాలు

తొలిస్థానంలో అమెరికా, రష్యా

ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాల స్థావరాలు కలిగిన దేశాల్లో అమెరికా, రష్యా తొలి స్థానంలో ఉన్నాయి. చైనాలో సుమారు 350 స్థావరాలు ఉంటాయని స్టాక్​హోమ్​ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అంచనా వేసింది. అమెరికా, రష్యా సుమారు 6వేల వరకు కలిగి ఉన్నట్లు తెలిపింది. గడిచిన 10 ఏళ్లలో చైనా తమ అణ్వాయుధ స్థావరాలను రెండింతలు పెంచిందని పెంటగాన్​ పేర్కొంది.

ఇదీ చూడండి:అమెరికాకు హెచ్చరికగా చైనా క్షిపణి పరీక్ష!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details