తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనాతో మేం మంచి సంబంధాలనే కోరుకుంటాం.. కానీ!' - అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

చైనాతో క్రియాశీలక సంబంధాలను పెంచుకోవాలనే అమెరికా కోరుకుంటోందని.. అయితే చైనా ద్వంద్వవైఖరిని ప్రదర్శిస్తూ వాగ్దానాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.

US wants open and constructive relationship but China continues to violate its promises: Trump
'చైనాతో క్రియాశీలక సంబంధాలను అమెరికా కోరుకుంటుంది'

By

Published : Jun 15, 2020, 12:18 PM IST

చైనాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో తాము నిర్మాణాత్మక సంబంధాలనే కోరుకుంటున్నామన్న ట్రంప్​.. ఆ దేశ మొండి వైఖరితో తన వాగ్దానాలను ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉందని ఆరోపించారు.

"చైనాతో సత్సంబంధాలను అమెరికా ఆకాంక్షిస్తోంది. చైనా మాత్రం అమెరికాతోనే కాకుండా పలు దేశాలతో ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోకూడదని ఇటీవల చైనాకు సూచించింది అమెరికా. దీనిపై ఐరాస భద్రతా మండలి సమావేశం కావాలని పిలుపునిచ్చారు. అయినా.. చైనా ధోరణిలో ఏ మాత్రం మార్పులేదు. హాంకాంగ్​లో జాతీయ భద్రత చట్టాన్ని అమలు చేసే దిశగానే చైనా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పార్లమెంటు కూడా దీనిని ఆమోదించింది.

ఇదీ చూడండి:'కరోనా నుంచి మేం కోలుకుంటున్నాం.. అమెరికా కష్టం'

ABOUT THE AUTHOR

...view details