అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించాలని అగ్రరాజ్యం కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థికసలహాదారు పీటర్ నవారో అన్నారు.
సుంకాల మహారాజు
శ్వేతసౌధం వాణిజ్యం, తయారీ పాలసీకి నేతృత్వం వహిస్తున్న నవారో.. ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో భారత పన్నుల విధానంపై మాట్లాడారు. భారత ఉత్పత్తులపై అమెరికా వసూలు చేస్తున్న సుంకాల కంటే.. 90 శాతం అధికంగా తమ ఉత్పత్తులపై ఇండియా సుంకాలు విధిస్తోందని అన్నారు. ఈ అధిక సుంకాలను తగ్గించి, పరస్పర ఆరోగ్యకరమైన వాణిజ్యానికి తోడ్పడాలని నవారో కోరారు.
"మేము భారత్లో వాణిజ్యం చేస్తున్నాం. నేను సరదాగా అంటున్నా.. 'భారతదేశం సుంకాల మహారాజు'. విదేశీ ఉత్పత్తులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశం భారత్. ఇది హాస్యాస్పదం."- పీటర్ నవారో, శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థిక సలహాదారు